

పులివెందుల: నడిరోడ్డుపై విద్యార్థులకు అందాల్సిన చిక్కీలు
పులివెందుల పట్టణంలోని నడిరోడ్డుపై రాష్ట్రప్రభుత్వం మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు అందిస్తున్న చిక్కీలు దర్శనమిస్తున్నాయి. విద్యార్థులకు అందాల్సిన చిక్కీలను నిర్లక్ష్యంగా నడిరోడ్డుపై పడవేయడంతో ఆదివారం స్థానికులు చర్చించుకుంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి నడిరోడ్డుపై చిక్కీలు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.