
పులివెందుల: అక్రమ సిలిండర్లు స్వాధీనం
పులివెందుల పట్టణంలోని గిరి రెస్టారెంట్ యజమాని వెంకటరామిరెడ్డి, అభిరుచి ఫ్యామిలీ రెస్టారెంట్ యజమాని సతీశ్ కుమార్ లపై కేసు నమోదు చేసి సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ అధికారులు నారాయణప్ప, శివన్నలు తెలిపారు. మంగళవారం సాయంత్రం విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. గృహ సిలిండర్లను అక్రమంగా వినియోగిస్తున్న 15 సిలిండర్లను స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేశామని వారు తెలిపారు.