సామర్లకోటలో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
సామర్లకోట విద్యుత్ సబ్ స్టేషన్ మరమ్మత్తుల కారణంగా శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 33/11 కె. వి సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని ఈఈ ఏవీఎల్డీఎస్ ప్రభాకర్ తెలిపారు. సబ్ స్టేషన్ మారమ్మతుల కారణంగా సామర్లకోట పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం కలుగుతుందన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ అంతరాయానికి తమతో సహకరించాలని ఈఈ ప్రభాకర్ తెలిపారు.