నంద్యాల జిల్లాలో ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు
ప్రజాశాంతికి భంగం కలిగిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదివారం నంద్యాలలో హెచ్చరించారు. ఎస్పీ ఆదేశాల మేరకు శాంతిభద్రతల పరిరక్షణ, నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషను పరిధిలో నివసిస్తున్న హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తులను సంబంధిత పోలీసు అధికారులు స్టేషనుకు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు.