మహానంది: హైందవ శంఖారావం భారీ బహిరంగ సభ విజయవంతం చేద్దాం
విజయవాడలో జనవరి 5న జరిగే హైందవ శంఖారావం భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని విభాగ్ బౌద్ధిక్ ప్రముఖ్ మన్నవ వేణుగోపాల్ పేర్కొన్నారు. ఆదివారం మహానంది మండల కేంద్రం తిమ్మాపురం గ్రామంలో హైందవ శంఖారావం బ్యానర్లు ఆవిష్కరించారు. అనంతరం ప్రధాన కూడళ్లలో బ్యానర్లు ఏర్పాటు చేశారు. మహానంది మండల టిడిపి అధ్యక్షుడు ఉల్లిమధు, అడ్డగాళ్ల చంద్రుడు, కనుమర్లపూడి రామయ్య, గద్వాల రామకృష్ణుడు, సంజీవ, దినేష్ తదితరులు పాల్గొన్నారు.