ఆర్థిక ఇబ్బందులు తాళలేక మద్యం బానిసై వ్యక్తి ఆత్మహత్య
బొబ్బిలి పట్టణం రెడ్డికవీధికి చెందిన తాపీ మేస్ర్తిజె అప్పారావు (40)సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడని పట్టణ సీఐ సతీష్‌కుమార్ తెలిపారు. కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వ్యసనాలకు బానిసగా మారి ఇంట్లో గ్యాస్‌స్టౌ, సిలిండర్ అమ్మేసి మద్యం సేవించాడు. అతని తీరుకు విసిగి భార్య, పిల్లలను తీసుకొని కన్నవారింటికి వెళ్లిపోయింది. దీంతో కలత చెంది ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.