బొబ్బిలి: రైల్వే అండర్ బ్రిడ్జిల్లో నిలిచిన వర్షపునీరు
బొబ్బిలి మున్సిపాలిటీ మల్లం పేటకు వెళ్లే రాస్తాలో అకాల వర్షపునీరు నిలిచిపోయీంది. రైల్వే అండర్ బ్రిడ్జిలలో వర్షపు నీరు నిల్వ ఉండడంతో పాటు నీరు ఊరుతోంది. దీంతో ఆ బ్రిడ్జిల కింద నీరు దాదాపు నాలుగు, ఐదు అడుగులమేర ఎత్తు నిల్వ ఉండటంతో. ఆ రహదారుల్లో వెళ్లాలంటే భయంభయంగా ఉందని గురువారం ఆ గ్రామస్థులు తెలుపుతున్నారు. అండర్ బ్రిడ్జి కింది నుంచి ద్విచక్రవాహనదారులు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు.