కొత్త ఆగ్రహారంలో భారీ అన్నదాన కార్యక్రమం
వినాయక నవరత్నాలు సందర్బంగా చీపురుపల్లి పట్నం కొత్త ఆగ్రహారం లో స్టూడెంట్ కల్చరల్ అసోసియేషన్ కమిటీ వారి ఆధ్వర్యంలో శుక్రవారం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమంలో గ్రామంలోని ప్రజలు భారీ ఎత్తున పాల్గొని స్వామి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమం లో కమిటీ సభ్యులు, పెద్దలు పాల్గొన్నారు.