సింగరాయకొండ: మూలగుంటపాడులో భారీ చోరీ
సింగరాయకొండ మండలం మూలగుంటపాడులోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగిన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఇంటి యజమాని శ్రీరామమూర్తి వ్యక్తిగత పనులపై కుటుంబ సభ్యులతో కలిసి నెల్లూరు వెళ్లాడు. ఈ సమయంలో ఇంటి వెనక నుంచి దొంగలు లోపలికి ప్రవేశించారు. తర్వాత బీరువాలోని 47 సవర్ల బంగారం, 11 కేజీల వెండి, రూ. 3 లక్షలు నగదును దొంగలు అపహరించారు. డి. ఎస్. పి శ్రీనివాసరావు సంఘటన స్థలంలో దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు.