

పొదిలి: ఆందోళన చేపట్టిన 18 మందిపై కేసు నమోదు
ప్రకాశం జిల్లా పొదిలి మండలం టి. సల్లూరు గ్రామంలో ఓ వ్యక్తికి అంతక్రియలు పూర్తిచేసే అంశంలో వివాదం తలెత్తింది. విషయాన్ని తెలుసుకున్న భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ ఆ కుటుంబాన్ని పరామర్శించి గ్రామస్తులతో కలిసి పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగారు. ఆ సమయంలో 108 వాహనానికి దారి ఇవ్వలేదని, వివిధ సెక్షన్లలో 18 మందిపై కేసు నమోదు చేశామని ఆదివారం స్థానిక ఎస్సై వేమన తెలిపారు.