నేడు ఏలూరు జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశం
ఏలూరు జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం బుధవారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి మంగళవారం తెలిపారు. ఎంపీ మహేశ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించే సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షిస్తారన్నారు. కావున జిల్లాలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మండల పరిషత్తు అధ్యక్షులు హాజరు కావాలని కోరారు.