Top 10 viral news 🔥

జాతీయ వార్తలు
మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు: ఏసర్ ఇండియా
ప్రముఖ ఇంజినీరింగ్ సంస్థ ఎల్అండ్టీ బాటలోనే మరో దిగ్గజ కంపెనీ మహిళల కోసం ముందడుగు వేసింది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ అయిన ఏసర్ ఇండియా మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో ఒక రోజు జీతంతో కూడిన సెలవు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే ఇది వారి సాధారణ సెలవులపై ఎలాంటి ప్రభావం చూపదు. 'మాతృక నెలసరి విధానంతో.. మహిళల ఆరోగ్యం, శ్రేయస్సుపై ప్రత్యేక దృష్టి సారించాం' అని ఏసర్ ఇండియా అధ్యక్షుడు, ఎండీ హరీశ్ కోహ్లీ వెల్లడించారు.