గూగుల్‌కు పోటీగా చాట్‌జీపీటీ సెర్చ్ఇంజిన్ (వీడియో)
జనరేటివ్ ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇన్నాళ్లు ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే ఇస్తూ వస్తున్న చాట్‌జీపీటీలో సెర్చ్ ఇంజిన్‌ను జోడించింది. సెర్చ్ ఇంజిన్ విషయంలో గూగుల్ ఆధిపత్యం కొనసాగుతున్న వేళ ఈ ఫీచర్‌ను తీసుకురావడం గమనార్హం. ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు ఇకపై తక్షణమే, వెబ్‌లింక్స్‌తో కూడిన రియల్‌టైమ్ సమాచారాన్ని అందుకోవచ్చని ఓపెన్ ఏఐ తెలిపింది.