
చంద్రునిపై శాశ్వత నిర్మాణాలకు బ్యాక్టీరియాతో ఇటుకల తయారీ?
చంద్రునిపై శాశ్వత నిర్మాణాలు చేపట్టే దిశగా జరుగుతున్న పరిశోధనల్లో కీలక ముందడుగు పడింది. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు జాబిల్లి ఉపరితలంపై భవనాలు నిర్మించేందుకు ఉపయోగించే ఇటుకల్లో పగుళ్లు నివారించేందుకు ‘స్పోరోసార్సినా పాశ్చరీ’ బ్యాక్టీరియాను ఉపయోగించే పద్ధతిని అభివృద్ధి చేశారు. శాస్త్రవేత్తలు తమ పరిశోధన ఫలితాలను ‘ఫ్రాంటియర్స్ ఇన్ స్పేస్ టెక్నాలజీస్’ అనే జర్నల్లో ప్రచురించారు.