జూబ్లీహిల్స్ లో పీజేఆర్ జయంతి వేడుకలు
జూబ్లీహిల్స్ పరిధిలో ఖైరతాబాద్ మాజీ ఎమ్మేల్యే పి. జనార్ధన్ రెడ్డి జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీజేఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మిక నాయకుడిగా ప్రజలకు ఎన్నో సేవలు చేశారని, చనిపోయిన ప్రజల గుండెల్లో ఎల్లప్పుడూ బతికే ఉంటారని కొనియాడారు.