హైదరాబాద్: ఈ పబ్బుల్లో న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి నిరాకరణ
న్యూఇయర్ వేడుకులకు హైదరాబాద్ సిద్ధమవుతున్నది. యువతను ఆకట్టుకునే పబ్‌లు, ఈవేంట్ ఆర్గనైజర్లు.. వివిధ ఆఫర్లతో రడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. రాత్రి ఒంటి గంట వరకు వేడుకలు ముగించుకోవాలని ఆదేశాలు జారీచేశారు. అదేవిధంగా జూబ్లీహిల్స్‌లోని 34 పబ్బుల్లో నాలుగు పబ్బులకు అనుమతి నిరాకరించారు. హాట్కప్, అమినేషియా, బ్రాండ్‌వే, బేబీ లాండ్ పబ్బుల్లో నూతన సంవత్సర వేడుకలకు పర్మిషన్ రద్దుచేశారు.