ఉప్పల్
నాచారం: జీరాక్స్ సెంటర్ లో అగ్నిప్రమాదం
నాచారం పోలీస్ స్టేషన్ పరిధి మల్లపూర్ లో గల జూరాక్స్ సెంటర్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.