మిరియాలు తింటే రోగనిరోధక శక్తి మెరుగు
మిరియాలను సాధారణంగా వంటలలో రుచి కోసం, మసాలాగా వాడుతాం. కానీ, వీటితో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మిరియాలలో పైపెరిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షిస్తాయి. వీటిలో ఉండే విటమిన్ సి, మాంగనీస్ వంటి విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచి, అంటువ్యాధులు అనారోగ్యాల నుండి శరీరాన్ని కాపాడుతాయి. జీర్ణక్రియ, లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తోడ్పడుతాయి.