బోధన్: భర్త మరణంపై భార్య ఫిర్యాదు
బోధన్ కి చెందిన ఆరుగొండ మహేష్ (30) తండ్రి మల్లయ్య ఇటీవల తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ నొప్పిని భరించలేక పోవడంతో గురువారం రాత్రి 11 గంటలకు ఇంటి నుండి వెళ్లిపోయి సాలూరు గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు అతని భార్య ఆరుగొండ మౌనిక బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్సై మచ్చేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.