Sep 26, 2024, 14:09 IST/
రూ.78 వేలు దాటేసిన బంగారం ధర
Sep 26, 2024, 14:09 IST
పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. దేశీయంగా పసిడి ధర మళ్లీ పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర గురువారం మరో రూ.400 పెరిగి రూ.78వేలకు చేరింది. అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ నెలకొనడం, దేశీయంగానూ వర్తకుల నుంచి కొనుగోళ్లు కొనసాగుతుండటం పసిడి ధరలకు రెక్కలు రావడానికి కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. దసరాకు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.