మంచిర్యాల
మంచిర్యాలలో రెండు లాడ్జీలు సీజ్
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయినాథ్ రెసిడెన్సీ, వెంకటేశ్వర లాడ్జీలను శనివారం అధికారులు సీజ్ చేశారు. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఉత్తర్వుల మేరకు పట్టణ ఇన్స్పెక్టర్ బన్సీలాల్ ఆధ్వర్యంలో లాడ్జీలకు తాళాలు వేసి సీజ్ చేశారు. ఈ రెండు లాడ్జిలలో ఇటీవల వ్యభిచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో దాడి చేసి లాడ్జి యజమానులు, నిర్వాహకులతో పాటు విటులపై కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.