ఢిల్లీ సీఎం ఆతిశీకి జెడ్ కేటగిరీ భద్రత
ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆతిశీకి ఢిల్లీ పోలీసులు జెడ్ కేటగిరీ భద్రత కల్పించారు. ఆమె కాన్వాయ్‌లో పైలట్‌తో సహా పోలీసు సిబ్బందితో భద్రత కల్పించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. కేంద్రహోంశాఖ ఆదేశాల మేరకు ఆతిశీకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. దీంతో ఆతిశీకి రక్షణగా పోలీసులు 22 మందిని షిఫ్టుల వారీగా విధులు నిర్వహిస్తున్నారు. జెడ్ కేటగిరీ భద్రతలో పీఎస్వోలు, ఎస్కార్ట్స్, సాయుధ గార్డులు ఉంటారు.