నిర్మల్
లక్ష్మణ్ చాంద: రెండు బైకులు ఢీ ఇద్దరికి గాయాలు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డ ఘటన ఆదివారం లక్ష్మణ్ చాంద మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం నర్సాపూర్(డబ్ల్యూ)కు చెందిన లక్ష్మణ్ బైక్ పై కనకాపూర్ వైపు వెళుతున్నాడు. కనకాపూర్ కు చెందిన వ్యక్తి బైక్ పై నర్సాపూర్ వైపు వెళుతుండగా రెండు బైక్ లు ఎదురెదురుగా ఢీకొనడంతో లక్ష్మణ్ కు తీవ్రగాయాలు కాగా, మరొకరికి స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు 108 కు సమాచారం ఇవ్వగా నిర్మల్ కు తరలించారు.