జగిత్యాల: అలిశెట్టి రచనలు అక్షర దీపికలు
కళాశ్రీ సాహితీ వేదిక జగిత్యాల జిల్లా అధినేత గుండేటి రాజు ఆధ్వర్యంలో శనివారం జగిత్యాలలోని శ్రీ సుఖీభవ హాల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ అక్షర సూరీడు స్వర్గీయ అలిశెట్టి ప్రభాకర్ జయంతి వర్ధంతి కార్యక్రమంలో అలిశెట్టి చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సినీ నటుడు బలగం సత్తన్న మాట్లాడుతూ అలిశెట్టి రచనలు అక్షర దీపికలు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఓదెల గంగాధర్ పాల్గొన్నారు.