కుక్కల బెడదతో తీవ్ర ఇబ్బందులు
వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులో బుధవారం కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. కుక్కల వలన తల్లిదండ్రులు వారి పిల్లలను బయటికి పంపాలంటే భయాందోళనకు గురవుతున్నారు. మూడు నెలల క్రితమే మున్సిపాలిటీలో కుక్కలను పట్టడం కోసమని మున్సిపల్ బిల్లులో 5 లక్షల రూపాయలు పెట్టి ఒక పిచ్చికుక్కని కూడా పట్టుకున్న దాఖలాలు మాత్రం లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు.