
నల్గొండ: రాజ్యాధికారం చైతన్య సదస్సు గోడపత్రిక ఆవిష్కరణ
వెనుకబడిన వర్గాల రాజ్యాధికారం కోసం జిల్లా కేంద్రంలో మార్చ్ మూడో తేదీన టీఎన్జీవో భవన్ లో నిర్వహించబోయే రాజ్యాధికార చైతన్య సదస్సు గోడపత్రికను వెనుకబడిన తరగతులు సమైక్య రాష్ట్ర అధ్యక్షులు ఎన్. చెన్న రాములు శనివారం నల్గొండ పట్టణంలో ఆవిష్కరణ చేశారు. జనాభాలో సింహ భాగంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు రాజ్యాధికారం రావలసిన అవసరం ఉందన్నారు.