ఇండోనేషియాలో భారీ భూకంపం
ఇండోనేషియాలోని తలాడ్ దీవుల సమీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.7 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. మంగళవారం తెల్లవారుజామున 2.18 గంటల సమయంలో ఈ భూకంపం చోటుచేసుకుంది. ఈ భూకంపం దాటికి ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది.