
ALERT: నేడు 202 మండలాల్లో వడగాలులు
AP: రాష్ట్రంలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 42 డిగ్రీలు దాటేసింది. సోమవారం రాష్ట్రంలోని 202 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరంలో 15, మన్యంలో 12, శ్రీకాకుళంలో 8 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశముంది. పల్నాడులో 19, తూ.గో.లో 19, అనకాపల్లిలో 16, శ్రీకాకుళంలో 16, కాకినాడలో 15, గుంటూరులో 14, ఏలూరులో 13, కృష్ణాలో 10, విజయనగరంలో 10, తదితర మండలాల్లో వడగాలులు వీస్తాయని చెప్పింది.