కొయ్యూరు: 30 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
అభివృద్ధి సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని జిసిసి మాజీ చైర్మన్ ఎంవివి ప్రసాద్ పేర్కొన్నారు. మండలంలోని రావణాపల్లి పంచాయతీలో నిర్వహించిన పల్లె పండుగకి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సిఎం కృషి చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా మంగళవారం 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సిమెంట్ రోడ్ల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు.