బత్తలపల్లిలో పర్యటించిన సర్వ శిక్షాభియాన్ డైరెక్టర్
శ్రీ సత్య సాయి జిల్లా సర్వ శిక్షాభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ దేవరాజు బత్తలపల్లి మండలంలో బుధవారం పర్యటించారు. మండల కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం స్పెషల్ ఆఫీసర్ పాఠశాలల్లో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.