ఒంటికి నిప్పు అంటించుకుని ఆత్మహత్యాయత్నం
ఒంటి పై పెట్రోల్ పోసుకొని ఓ వ్యక్తి నిప్పు అంటించుకున్న ఘటన చిత్తూరులో మంగళవారం జరిగింది. టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య వివరాల ప్రకారం, చిత్తూరు నగర పరిధిలోని స్వామి మేస్త్రి వీధికి చెందిన వినోద్ కుమార్ అనే వ్యక్తి భార్య కాపురానికి రాకపోవడంతో మనస్తాపం చెంది తేనె బండ వద్ద మంగళవారం ఉదయం పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. బాధితుడి అన్న దినేశ్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.