
ఎటపాక: విషాదం.. ఆత్మహత్యకు పాల్పడిన ఇంటర్ విద్యార్థిని
అల్లూరి జిల్లా ఎటపాకలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల వివరాల ప్రకారం, ఎటపాకకు చెందిన యోగానందిని అనే విద్యార్థిని తెలంగాణ ఖమ్మం జిల్లాలోని ఇల్లందులోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోందని, శుక్రవారం ఉదయం స్టడీ అవర్కు హాజరైన ఆమె తిరిగి హాస్టల్కు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.