
దేవీపట్నం: ఉమాచోడేశ్వరస్వామి ఆలయంలో భారీ బందోబస్తు
దేవీపట్నం మండలం శ్రీ ఉమాచోడేశ్వరస్వామి వారి ఆలయం సమీపంలోని గోదావరి నది తీరానికి బుధవారం ఉదయం నాడు మహాశివరాత్రి సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చారు. భక్తులు జల్లు స్నానాలు చేసి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ షరీఫ్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.