సూర్యలంక పర్యాటక కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వేగేశన
బాపట్ల మండలం సూర్యలంక సముద్ర తీరంలో బుధవారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మతో పాటు కూటమి పర్యటించారు. బీచ్ డెవలప్మెంట్ కార్తీక మాసంలో సముద్ర తీరానికి వచ్చే భక్తులకు ఏటువంటి ఇబ్బంది లేకుండా చేయాల్సిన ఏర్పాట్లు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తీరంలో మౌలిక వసతులతో పాటు పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడు సలగల రాజశేఖర బాబు, అధికారులు పాల్గొన్నారు.