పెడన - Pedana

17వ డివిజ‌న్ లో ఇంటింటికి ఎన్నిక‌ల ప్ర‌చారం

17వ డివిజ‌న్ లో ఇంటింటికి ఎన్నిక‌ల ప్ర‌చారం

జ‌గ‌న్ కి త‌న‌పై రాష్ట్ర వ్యాప్తంగా వున్న ప్ర‌జా వ్య‌తిరేక‌త అర్థ‌మైంది. జ‌గ‌న్ ను వైసిపి మేనిఫెస్టో కూడా కాపాడ‌లేద‌ని తెలిపోయింది. అందుకే ఇప్పుడు ఎన్డీయే కూటమి అభ్యర్థుల ఓట్లు చీల్చేందుకు కొత్త కుట్ర‌కు వైసిపి తెరలేపింది. గాజు గ్లాసు గుర్తు ఫ్రీ సింబ‌ల్ చేయ‌టంపై ఆర్.వో అధికారులు పునఃసమీక్ష చేయాల‌ని బిజెపి, జ‌నసేన బ‌ల‌ప‌రిచిన టిడిపి విజ‌య‌వాడ పార్ల‌మెంట్ అభ్య‌ర్థి కేశినేని శివ‌నాథ్ కోరారు. తూర్పు నియోజ‌క‌వ‌ర్గం 17వ డివిజ‌న్ రాణిగారితోట‌లో కేశినేని శివ‌నాథ్, టిడిపి ఎమ్మెల్యే అభ్య‌ర్థి గ‌ద్దె రామ్మోహ‌న్ తో క‌లిసి మంగ‌ళ‌వారం ఇంటింటికి ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ ఎన్నిక‌ల ప్ర‌చారం బాప‌న‌య్య న‌గ‌ర్ శ్రీ కృష్ణ‌దేవ‌రాయ స్కూల్ ద‌గ్గ‌ర మొద‌లై, గుండు స‌త్యం వారి వీధి, గుడ్ మార్నిగ్ స్ట్రీట్, నాగ పుట్ట రోడ్, రాణి రంగ‌మ్మ వీధి, సిద్దెం నాగేంద్ర రోడ్డు, వాణి షామియానా రోడ్ ల‌లో సాగింది. వీరి ప్ర‌చారానికి ప్ర‌జ‌ల నుంచి విశేష‌స్పంద‌న ల‌భించింది. మ‌హిళ‌ల‌కు మంగ‌ళ‌హారతులు ప‌ట్టారు. ఇంటింటికి వెళ్లి టిడిపి సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాలు అంద‌జేసి చంద్ర‌బాబు అధికారంలోకి రాగానే అంద‌జేయ‌బోయే ప‌థ‌కాలు వివ‌రించి..రెండు ఓట్లు సైకిల్ గుర్తు వేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఈ సంద‌ర్బంగా కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ వైసిపి ఎన్నికుట్ర‌లు ప‌న్నినా ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్త‌తో వున్నారు. ఎన్డీయే అభ్య‌ర్ధుల్ని భారీ మెజార్టీతో గెలిపించ‌బోతున్నారు. ఇక తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో కృష్ణ‌లంక క‌ర‌కట్ట ప్రాంతంలో రిటైనింగ్ వాల్ గ‌ద్దె రామ్మోహ‌న్ హ‌యంలో ప్రారంభమైంది. కొంత‌మంది ఈ ప్రాంతంలో అసాంఘిక శ‌క్తుల్ని పెంచటంతో పాటు, గంజాయికి అడ్డా మార్చాల‌నుకుంటున్నారు. వారి ఆట‌లు సాగ‌వ‌ని..ప్ర‌జ‌ల‌కు విధ్వంసాన్ని, వినాశాన్ని కోరుకోవ‌టంలేదు. ప్ర‌జ‌లు వారి బిడ్డ‌ల భ‌విష్య‌త్తును కోరుకుంటూ చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి కావాల‌నుకుంటున్నార‌ని తెలిపారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనే కాదు.. ఈ 17వ డివిజ‌న్ లో కూడా చాలా స‌మ‌స్య‌లు వున్నాయి..వాటిని అధికారంలోకి రాగానే గ‌ద్దె రామ్మోహ‌న్ తో క‌లిసి ప‌రిష్క‌రిస్తాన‌ని తెలియ‌జేశారు. అనంత‌రం గ‌ద్దె రామ్మోహ‌న్ మాట్లాడుతూ జ‌గ‌న్ కి శిక్ష ప‌డాల‌ని వారి కుటుంబ స‌భ్యులే కోరుకుంటున్నార‌ని తెలిపారు. జ‌గ‌న్ మేనిఫెస్టో మూడు రాజ‌ధానుల‌కి అనుకూలంగా, అమ‌రావ‌తి రాజ‌ధానికి వ్య‌తిరేకంగా వుంద‌ని మండిపడ్డారు. గ‌త ఐదేళ్లుగా అభివృద్దికి దూరంగా వున్న ప్ర‌జ‌లు ఈ సారి చంద్ర‌బాబును గెలిపించి రాష్ట్ర అభివృద్దికి స్వాగ‌తం చెప్పాల‌ని పిలుపునిచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో డివిజ‌న్ పార్టీ అధ్య‌క్షురాలు రాయి రంగ‌మ్మ‌, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు సొంగా సంజ‌య్ వ‌ర్మ‌, కార్పొరేట‌ర్ ముమ్మ‌నేని ప్ర‌సాద్, బిజెపి తూర్పు నియోజ‌కవ‌ర్గ క‌న్వీన‌ర్ పోతంశెట్టి నాగేశ్వ‌ర‌రావు, జ‌న‌సేన పార్టీ న‌గ‌ర కార్య‌ద‌ర్శి గుండు రాము, జ‌న‌సేన పార్టీ 17వ డివిజ‌న్ అధ్య‌క్షుడు లంక‌లప‌ల్లి వెంక‌ట‌రావు, జ‌న‌సేన పార్టీ 18వ డివిజ‌న్ అధ్య‌క్షుడు వేముల వెంక‌టేష్‌, బిజెపి డివిజ‌న్ మండ‌లాధ్య‌క్షుడు పైడి నారాయ‌ణ స్వామి ల‌తో పాటు బిజెపి, జ‌న‌సేన, టిడిపి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు భారీ సంఖ్య‌లో పాల్గొన్నారు.

వీడియోలు


రాజన్న సిరిసిల్ల జిల్లా