ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ప్రైవేట్ పాఠశాల బస్సు.
చిత్తూరు జిల్లా , పుంగనూరు పట్టణ పరిధిలోని మదనపల్లె రోడ్డు మిత్ర మాల్ వద్ద ద్విచక్ర వాహనంలో వెళ్తున్న గుర్తు తెలియని విద్యార్థిని ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు శనివారం ఉదయం 8 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఢీకొనడంతో విద్యార్థి సృహా తప్పి పడిపోయాడు. వెంటనే స్థానికులు సిపిఆర్ చేసి విద్యార్థిని హుటా హుటిన ఆటోలో పుంగనూరు ఏరియా హాస్పిటల్ తరలించారు. గాయపడిన విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.