మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం
విజయనగరం జిల్లా మెంటాడ మండలానికి పర్యటనకు వెళ్తున్న రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనం ప్రమాదానికి గురైంది. గురువారం ఉదయం రాంభద్రపురం మండలం భూసాయవలస వద్ద ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో నలుగురు పోలీస్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కొరకు ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా రానున్నాయి.