ఉక్కు పోరాటం ఆగదు
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కూర్మన్నపాలెం వద్ద కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం నాటికి 1308 రోజులకు చేరుకున్నాయి. స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలన్నారు.