
ఉంగుటూరు: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
ఉంగుటూరు మండలం గొల్లగూడెం విద్యుత్ స్టేషన్, ఎ. గోకవరం సబ్స్టేషన్ పరిధిలో మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు పనులను శుక్రవారం చేపట్టనున్నట్లు ఈఈ అంబేద్కర్ తెలిపారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు ఎ. గోకవరం, కొత్తగూడెం ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని ఈఈ కోరారు.