
ఉంగుటూరు: విద్యార్థులకు శక్తి యాప్ పై అవగాహన
మహిళల రక్షణే ధ్యేయంగా నూతనంగా ఏర్పాటు చేసిన శక్తి టీమ్ లు పని చేస్తాయని భీమడోలు ఎస్సై సుధాకర్ తెలిపారు. స్థానిక డిగ్రీ కళాశాలలో మంగళవారం విద్యార్థులకు శక్తి యాప్ పై అవగాహన కార్యక్రమాన్ని ఎస్సై నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ బొమ్ము రవికుమార్, శక్తి టీం సభ్యులు చలపతిరావు, రత్న మౌనికలతో కలిసి శక్తి గోడపత్రికలను ఆయన ఆవిష్కరించారు.