
టెన్త్ పరీక్షలు.. ఒంటిపూట బడుల సమయం మార్పు
AP: ఒంటిపూట బడుల సమయంలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నాయి. ఎగ్జామ్స్ జరుగుతున్న పాఠశాలల్లో ఒంటిపూట బడుల ప్రారంభ సమయం మ.1.30 గంటలకు మార్చాలని మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. టెన్త్ పరీక్షా పత్రాలు వెళ్లేంత వరకు విద్యార్థులు ఎండలో వేచి ఉండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకు ముందు మ.1.15 గంటలకు స్కూళ్లు ప్రారంభమయ్యేవి.