మంచిర్యాల
ఖాతాదారుడికి భీమా చెక్కు అందజేత
రామకృష్ణాపూర్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జనరల్ హెల్త్ ఇన్సురెన్స్ కలిగి ఇటీవల ప్రైవేట్ ఆసుపత్రిలో కుమారుడికి చికిత్స అందించిన గెయిని రమేష్ అనే ఖాతాదారుకు గురువారం భీమా చెక్కు పంపిణీ చేశారు. బ్యాంకులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేనేజర్ గోపాల్ రూ. 27 వేల భీమా చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్బిఐ ఇన్సురెన్స్ మేనేజర్ అరుణ్, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.