నారాయణ్ పేట్
పేటలో వరుస దొంగతనాలతో భయ బ్రాంతులకు గురవుతున్న దుకాణ దారులు
నారాయణపేట జిల్లా కేంద్రంలో గత ఐదు రోజుల క్రితం స్థానిక పాత గంజ్ లో గల అంబికా సూపర్ మార్కెట్ లో దొంగతం మరవక ముందే, గత రాత్రి కొత్త బస్టాండ్ ఎదురుగా గల శ్రీ వేంకటేశ్వర సూపర్ మార్కెట్ లో మళ్ళీ దొంగతనం జరిగింది. దీంతో పట్టణంలో దుకాణదారులు భయాందోళన చెందుతున్నారు. పోలీస్ లు రాత్రి వేళల్లో గస్తీ పెంచాల్సి ఉందని ప్రజలు, దుకాణాదారులు కోరుతున్నారు.