బోధన్: ఆదివారం గిడ్డంగుల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే రాక
నవీపేట్ మండలంలోని బినోల సొసైటీ పరిధిలోని నాలేశ్వర్, లింగాపూర్ గ్రామాలలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదివారం పర్యటించనున్నారని సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మాన్లు శనివారం తెలిపారు. ఉదయం 9 గంటలకు నాళేశ్వర్, 10 గంటలకు లింగాపూర్ గ్రామాలలో కార్యక్రమాలు ఉంటాయని ఈ కార్యక్రమానికి సొసైటీ పరిధిలోని రైతులు హాజరుకావాలని కోరారు.