బోధన్: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం
తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై ఎమ్మెల్సీ కవిత పిలుపు మేరకు బోధన్ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి మంగళవారం బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చరిత్రను మర్చిపోయిందని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రజాక్, ఎస్సీ ఎస్టీ జిల్లా సభ్యులు పెరిక రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.