వర్నిలో మొరాయిస్తున్న సెంట్రల్ లైటింగ్
వర్ని మండలం సత్యనారాయణ పురం గ్రామంలో వర్ని నుండి నిజామాబాద్ వెళ్ళే మార్గంలో డివైడర్ మధ్యలో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ మొరాయిస్తోంది. కొన్ని చోట్ల ఒక వైపు మాత్రమే వెలుగుతూ ఉంటే, కొన్ని చోట్ల రెండు వైపులా వెలగడం లేవు. దీంతో అంధకారం నెలకొంది. కావున అధికారులు స్పందించి పాడైపోయిన సెంట్రల్ లైటింగ్ బల్బుల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.