బోధన్: కాంగ్రెస్ గుండాలను కఠినంగా శిక్షించాలి: రాజేందర్ గౌడ్
బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలను కఠినంగా శిక్షించాలని నవీపేట్ మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి రాజేందర్ గౌడ్ ఒక ప్రకటనలో మంగళవారం డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందని అన్నారు. దీనికి సీఎం, పీసీసీలు ఇద్దరు బాధ్యత వహించి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి భౌతిక దాడులు చేస్తే ప్రతి దాడులకు వెనుకాడబోమని హెచ్చరించారు.