జూబ్లీహిల్స్ లో ఉపయోగంలో లేని వస్తువుల సేకరణ
ఉపయోగంలో లేని వస్తువులను సేకరించినందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక డ్రైవ్ చేపడుతోంది. శనివారం జూబ్లీహిల్స్ సర్కిల్ పరిధి పలు ప్రాంతాల్లో అధికారులు డ్రైవ్ నిర్వహించారు. స్థానిక కాలనీవాసుల నుంచి ఉపయోగంలో లేని వస్తువులను సేకరించారు. వీటిని బహిరంగ ప్రదేశాల్లో పడేయడంతో చెత్త పేరుకుపోతుందని, తమకు ఇస్తే వేరే విధంగా ఉపయోగపడతాయని అవగాహన కల్పించారు.