సీఎం రేవంత్ అధ్యక్షతన సీఎల్పీ సమావేశం
TG: సీఎం రేవంత్ అధ్యక్షతన మరి కాసేపట్లో సీఎల్పీ సమావేశం ప్రారంభంకానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మాదాపూర్‌లోని ట్రైడెంట్ హోటల్లో ఈ సమావేశం జరగనుంది. పార్టీ ఇంచార్జీ మున్షీ, ఏఐసీసీ ఇంచార్జ్ కార్యదర్శి విశ్వనాథం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరుకానున్నారు. టీపీసీసీ చీఫ్‌గా మహేశ్‌కుమార్ గౌడ్ నియామకం తర్వాత మొదటి సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా ఆయనకు సన్మానం చేయనున్నట్లు సమాచారం.