ఎల్లుండి నుంచి పీసీసీ చీఫ్ జిల్లాల పర్యటన
ఈనెల 16వ తేదీ నుంచి తాను జిల్లాల్లో పర్యటించబోతున్నట్లు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పర్యటిస్తానన్నారు. మొదటి పర్యటన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మొదలు పెడతామన్నారు. 18న మెదక్ పార్లమెంట్ లో నియోజకవర్గంలో పర్యటిస్తానన్నారు. ఈ పర్యటనలకు సంబంధించిన షెడ్యూల్ త్వరలో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.